గంగాధర, ఏప్రిల్ 9: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు దండుగా కదులుదామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, లక్ష్యం మేరకు సభకు జనాన్ని తరలించి విజయవంతం చేద్దామని నిర్దే శం చేశారు. గంగాధర మండలం కురిక్యాల పరిధిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో బుధవారం చొప్పదండి నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి రజతోత్సవ సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నిం టా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు.
రజతోత్సవ సభకు చొప్పదండి నియోజకవ ర్గం నుంచి 10 వేల మందిని తరలించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి సభకు తరలుదామన్నారు. ప్రతి గ్రామంలో జెండా గద్దెలకు రంగు వేయించాలని, రజతోత్సవ సభ వాల్ రైటింగ్ జరిగేలా చూడాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు దూలం బాలగౌడ్, పునుగోటి కృష్ణారావు, సాగి మహిపాల్‌రావు, కొడంపల్కల రామ్మోహన్రావు, నాగి శేఖర్, మేచినేని నవీన్‌రావు, కత్తెరపాక కొండయ్య, జనగం శ్రీనివాస్, మాచెర్ల వినయ్, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పులి వెంకటేశ్‌గౌడ్, బందారపు అజేయ్‌కుమార్, ఆకుల మధుసూదన్, కంకణాల విజేందర్‌రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్, దూలం శంకర్‌గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.