విలీనాన్ని నిలిపేయండి
కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
- చింతకుంట గ్రామస్తుల రాస్తారోకో
కొత్తపల్లి, డిసెంబర్ 23 : కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. చింతకుంట కెనాల్ వద్ద కరీంనగర్-సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతినాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా దొడ్డిదారిన చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
విలీనం వల్ల సుమారు వెయ్యి మంది ఉపాధిహామీ కార్మికులకు తిండి దొరకని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. పన్నులు రెండింతలు పెరిగి బడుగు, బలహీనవర్గాలకు అర్ధిక ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. గ్రామపంచాయతీగా ఉంటేనే చింతకుంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి విలీన ప్రక్రియను వెంటనే నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకో అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రేణయ్య, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, రైతు సంఘం అధ్యక్షుడు శంకరయ్య, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి లచ్చిరెడ్డి, కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

