చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు కరీంనగర్ శివారు జగిత్యాల ప్రధాన రహదారిలో పొగమంచు కమ్మేసింది. సూర్యోదయమైనా మంచు తెరలు తొలగకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు అంతటా ఇదే పరిస్థితి కనిపించింది.
– కరీంనగర్ ముకరంపుర, డిసెంబర్ 24