రిజిస్ట్రేషన్ శాఖలో ఏళ్ల తరబడి దరఖాస్తుల పెండింగ్.. చలానా డబ్బుల చెల్లింపులకు మోక్షమెప్పుడో?.. రిజిస్ట్రేషన్ శాఖలో ఏళ్ల తరబడి ఎ
రిజిస్ట్రేషన్ శాఖలో ఏళ్ల తరబడి దరఖాస్తుల పెండింగ్.. చలానా డబ్బుల చెల్లింపులకు మోక్షమెప్పుడో?.. రిజిస్ట్రేషన్ శాఖలో ఏళ్ల తరబడి ఎ
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 22 : రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న చలానా డబ్బులు చెల్లించడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరివి లక్షలాది రూపాయలు విలువ చేసే చలాన్లు, ఏడాదిన్నరగా పెండింగ్లో ఉండగా, తెచ్చిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థిరాస్తుల క్రయ విక్రయాల అనంతరం కొనుగోలుదారు తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇట్టి మొత్తాన్ని చలాన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. రిజిస్ట్రేషన్లు జరగని పక్షంలో సంబంధిత కార్యాలయ అధికారులు, చలానా ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన మొత్తంలో 10% మినహాయించుకుని, మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని నెలలుగా చెల్లించకుండా దరఖాస్తుదారుల విజ్ఞప్తులను పెండింగ్లో ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 1200 కు పైగా దరఖాస్తులు ఇలా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.20 కోట్ల పైచిలుకు మొత్తం దరఖాస్తుదారులకు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
చలాన్ తీసిన ఆరు నెలల్లోపు సంబంధిత వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు దానిని పరిశీలించి సదరు వ్యక్తికి చెల్లించాల్సిన మొత్తం, ఆయన వివరాలు ట్రెజరీ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పంపుతారు. వాటిని పరిశీలించిన అనంతరం కోశాగార శాఖ నుంచి అందాల్సిన మొత్తం దరఖాస్తుదారుడి ఖాతాలో జమ అవుతుంది. ఆరు మాసాలు దాటితే రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్ నుంచి దరఖాస్తుదారుడి వివరాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. దీనిపై అవగాహన లేని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కంప్యూటర్ నుంచి తొలగిపోయిన వారి వివరాలు ఆఫ్లైన్లో ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపి, తిరిగి జిల్లాకు చేరే క్రమంలో కూడా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏతా, వాతా బాలారిష్టాలు దాటి కోశాగార కార్యాలయానికి వెళ్లినా, వరుస క్రమంలో చెల్లింపులు చేయాల్సి రావటంతో నిధుల అందుబాటును బట్టి ఆర్బీఐ విడుదల చేస్తుండటం కూడా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని బాధితులు కోరుతున్నారు.
మావద్ద పెండింగ్ లేవు: ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
చలానా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోని వారి దరఖాస్తులు మా వద్ద పెండింగ్ లేవు. తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తీసుకొని, ట్రెజరీ ఆఫీసుకు పంపాము.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

