కమాన్‌చౌరస్తా, మే 9 : ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో ట్రినిటీ కళాశాలల విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్లు విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ ప్రైం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ప్రణాళికతో దిశానిర్దేశం చేయడం, విద్యార్థుల నిరంతర సాధన వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నిఖిత, ఎన్ మానస 990, అభిజ్ఞ, వెన్నెల 989, జీ కీర్తన్‌రెడ్డి, టీ మనోజ్ఞ 988 మారులు, ఎం అనూప్‌రెడ్డి, జే రక్షిత 987 మారులు సాధించారన్నారు.
అలాగే, బైపీసీ విభాగంలో చంద్రశేఖర్ 989, సాయి లక్ష్మి ప్రసన్న, రిషిత, కొన్నరణి, నాగజ్యోతి, తేజుశ్రీ 988 మారులు, అక్షర, విజ్ఞేశ్ 985 మారులు సాధించారని తెలిపారు. ఎంఈసీ విభాగంలో ఆర్ సాత్విక 985, సీఈసీలో సుమేర అంజుమ్, పీ ఐశ్వర్య 977 మారులు సాధించినట్లు చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో వీ ఆశ్రిత, ఎం శ్రావ్య 467 మారులు, జీ హర్షిత, రక్షిత, లక్ష్మీ ప్రసన్న, మహాలక్ష్మి, అభినయ, గణేశ్ 456 మారులు, నిస్సిజాన్సర్, హారిక, ప్రనవి, సుహీరా ఆళ్వార్, శివాని, శ్రీజ, అఖిల, వర్దిని, శ్రీనిధి, ప్రవళిక, ప్రశాంత్ 465 మారులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో గంగాశ్రీ 436, రాణి 435, రిదా హర్మన్ 434, బుప్రా అయిమన్, శ్రీనిధి 433, వైష్ణవి, అతిఫా నుజహత్ 432, ఎంఈసీలో పూజ 470, సీఈసీలో వర్శిని 489, బీ త్రిశ 481 మారులు సాధించినట్లు వివరించారు.