కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)/ గంభీరావుపేట: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను తెలుపుతూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన సిరిసిల్లలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం ఆడుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మతులు చేసి, ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా పేరు గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పడిన చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్టు ప్రతిష్టను మంటగలుపుతుందని మండిపడ్డారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టి గొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజనిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన చలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కాళేశ్వరంపై వాస్తవాస్తవాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రం చదివితే పూర్తిగా అవగతమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పికొట్టాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

