Kamanpur | కమాన్‌పూర్ నుండి దీక్షా దివస్ సభకు తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
అలుగునూర్‌లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు కమాన్‌పూర్ మండలంలో నుండి కమాన్‌పూర్, జూలపల్లి, గుండారం, రొంపికుంట, నాగారం, పేరపల్లి, పెంచికల్పేట్, గొల్లపల్లి, సిద్దిపల్లె గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.
Kamanpur | కమాన్ పూర్, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్ సందర్భాన్ని పురష్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అలుగునూర్‌లో నిర్వహిస్తున్న సభకు కమాన్‌పూర్ మండలంలో నుండి కమాన్‌పూర్, జూలపల్లి, గుండారం, రొంపికుంట, నాగారం, పేరపల్లి, పెంచికల్పేట్, గొల్లపల్లి, సిద్దిపల్లె గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ శంకర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుందన్నారు. కేసీఆర్ దీక్ష అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటి మహాత్తర దీక్ష చేపట్టిన సందర్భాన్ని యాది చేసుకుంటూ, నేటి యువతరానికి స్ఫూర్తిని నింపేలా నిర్వహించే దీక్షా దివస్ సభకు ఊరూరా నుండి ఉత్సాహంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

