అభివృద్ధా.. విధ్వంసమా..? ఏది కావాలో ప్రజలే ఆలోచించాలి
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారు కావాలో.. విధ్వంసం సృష్టించే వారు కావాలో? ప్రజలే ఆలోచించాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.
- అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం
- ఐదేళ్లలో బీజేపీ చేసిందేమీలేదు
- అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే బీఆర్ఎస్ను గెలిపించండి
- బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కార్పొరేషన్, మే 11: కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారు కావాలో.. విధ్వంసం సృష్టించే వారు కావాలో? ప్రజలే ఆలోచించాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. రేపటి ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, పదేళ్లలో ఆదర్శంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బడే మియా, చోటే మియా కలిసి హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి వాటి ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలని స్పష్టం చేశారు. బండి సంజయ్ వీటిపై మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. వారి పార్టీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అవుతారని దుయ్యబట్టారు. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్లో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్లామని, ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. మళ్లీ కారు రావాలన్న నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నదని తెలిపారు. మార్పు అంటే ఏదో మంచి జరుగుతుందని అనుకున్నాం కానీ, ఐదు నెలల్లో ఇంత అధ్వానంగా అవుతుందని అనుకోలేదని, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తమకు పోటీ కాదని, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. కరీంనగర్లో ఇప్పుడు అభివృద్ధి ఆగిపోతే మరో 20 ఏండ్లు వెనక్కి పోతుందని ఆందోళన వ్య క్తం చేశారు. అభ్యర్థి ఫొటో లేకుండా కరపత్రాలను పంచుతున్నది ఒక్క బండి సంజయ్ మాత్రమేనని, అందులో మోడీ ఫొటో మాత్రమే ఉందన్నారు. ఏ అభివృద్ధి గురించి మాట్లాడని సంజయ్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం పార్టీ సమావేశాల్లో తప్ప ఏ రోజు కూడా కలిసింది లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మోడీని అనేక సార్లు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలిశానని, రాష్ట్ర సాధన కోసం అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిశానని ఫొటోలు చూపించారు. కానీ, సంజయ్ మాత్రం కనీసం ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలిసిన దాఖలాలు లేవన్నారు. పైగా ఇటీవల ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కోసం వేములవాడకు వస్తే.. ఆయన మాత్రం 75 ఏండ్లలో రాజన్న దర్శనానికి ఏ ప్రధాని అయినా వచ్చారా..? అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఈ ప్రచారాలతో మాజీ ప్రధానులను అవమానిస్తున్నాడని, ఇక్కడి దాకా వచ్చిన మోడీని కనీసం కరీంనగర్‌కు ఇది కావాలని కూడా అడుగలేకపోయిండని విమర్శించారు. ప్రధాని ఏమీ ఇవ్వలేదని తాము అంటే ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నాడని, కోడ్ ఉన్నా ఇది చేస్తామని హామీ ఇవ్వచ్చు కదా అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్, అక్బర్‌హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు రూప్సింగ్ పాల్గొన్నారు.
గెలిపిస్తే విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతా
తనను గెలిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా. అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని తీసుకొస్త. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెస్త. ఇప్పటికే రెండు జాతీయ రహదారులను తెచ్చిన. పనులు నడుస్తున్నయి. మరో మూడు జాతీయ రహదారులు పనులు తీసుకొస్త. రాజీవ్ రహదారిని ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్త. కరీంనగర్‌ను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుత. ఈ నెల 13న ఓటింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
– పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్
అభివృద్ధి కోసం వినోద్‌ను గెలిపించాలి
రాష్ట్రం నుంచి నేను, కేంద్రం నుంచి వినోద్ నిధులు తెస్తేనే నగరం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. పదేళ్లలో వినోద్, నేను నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినం. ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే నాకు తోడుగా వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించాలి. మేమెప్పుడూ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తం.
– కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

