Veenavanka | వీణవంక, ఏప్రిల్ 27 : వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ బీఅర్ఎస్ అని ఈ సందర్భంగా వారన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా చోట్ల మాజీ ఎంపీపీ రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత, సర్పంచులు దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, మొగిలయ్య, బావు సంపత్, గాజుల శంకరయ్య, కుమార్, సంపత్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి మహేశ్ గౌడ్, కుమారస్వామి, నాయకులు పొదిల రమేష్, కామిడి శ్రీనివాస్‌రెడ్డి, జీ రవీందర్రావు, జీడి వెంకటస్వామి, నలుబాల రాజేశ్, బుర్ర రాములు, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, మారముల్ల ప్రభు, కృష్ణచైతన్య, రెడ్డిరాజుల రవి, యాసిన్, నీల శ్రీకాంత్, వోరెం మధు, గెల్లు కుమార్, మల్లెత్తుల సదయ్య, అనిల్, బొంగోని రాజయ్య, ఫసియొద్దీన్, జక్కు నారాయణ తదితరులు పాల్గొన్నారు.