Ramancha | రామంచలో పోషణ మాసంపై అవగాహన
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా హాజరై పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు.
Ramancha | చిగురుమామిడి, సెప్టెంబర్ 25 : పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా హాజరై పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వయస్సుకు తగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గర్భధారణ సమయంలో వైద్యుల సూచనలను పాటిస్తూ సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఐరన్, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలని వివరించారు. ప్రసవానంతరం బాలింతలు కూడా తగినంత పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు శిశువుకు తల్లిపాలను అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు.కిశోర బాలికలు పోషకాహార లోపానికి గురికాకుండా చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి ఆరోగ్య నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్ప అంజలి, ఆశ మంజుల, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

