కరీంనగర్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో బతుకమ్మ ఆడే ప్రాంతాలతో పాటు నిమజ్జన ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయిలో లైటింగ్ సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే నిమజ్జన ప్రాంతాల్లో మహిళలకు ఇబ్బంది కలుగకుండా మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశామనిపేర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వీధుల్లోనూ భారీగా లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన చెప్పారు. ప్రజలందరూ బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లోనూ గత ఈతగాళ్లను సిద్దంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.