Applications | కాల్వశ్రీరాంపూర్, జూన్ 20 : కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అడ్మిషన్ ఇస్తున్నామని, 65సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కులం, ఆధార్, స్టడీ సర్టిఫికెట్ తో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకువచ్చి హాస్టల్ లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. వసతి గృహంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఆశక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.