Diet College | తిమ్మాపూర్, జూన్13: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఫిలాసఫీ, సైకాలజీ, గణిత బోధన పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు, కళావిద్య, వ్యాయామ విద్యలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొ న్నారు.
ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ బోధన పద్ధతులు, ఫిలాసఫీ/సైకాలజీ, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతుల ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ మొండయ్య తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఈడీ డిగ్రీతో పాటు, బోధన పద్ధతులకు సంబంధించిన మెథడాలజీలో బీఎడ్ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల19న సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్ డైట్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలని అన్నారు.