Chigurumamidi | దీక్షా దివస్ కు రావాలని చిగురుమామిడిలో బొట్టు పెట్టి ఆహ్వానం
అలుగునూర్ లో ఆదివారం నిర్వహించే దీక్షా దివస్ కు భారీగా తరలిరావాలని చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం ఇంటింటా తిరిగి బొట్టు పెట్టి ప్రచారాన్ని నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 28 : అలుగునూర్ లో ఆదివారం నిర్వహించే దీక్షా దివస్ కు భారీగా తరలిరావాలని చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం ఇంటింటా తిరిగి బొట్టు పెట్టి ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష, త్యాగం, పోరాటాలను గుర్తుచేస్తూ, దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన నిరాహార దీక్షనే ఉద్యమానికి మలుపు తిప్పిందని, ఆ స్ఫూర్తిని యువతకు, భావితరాలకు అందించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
నాయకులు ప్రతీ ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, దీక్షా దివస్ కు తరలి రావాలని ఆహ్వానించారు. ఇంటింటికి వాల్ పోస్టర్లు అతికించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, గ్రామ శాఖ కన్వీనర్ కాశబోయిన రాజు, ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, నాయకులు దాసరి రాజు, లావణ్య, స్వరూప, శంకరయ్య, స్రవంతి, రాజు, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

