Vemulawada | బతికి ఉన్నప్పుడు రాని ఇల్లు.. కొడుకు పోయిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ ఇల్లు
చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు నిజాంబాద్ లో ఉంటుండగా మరో కుమారుడు రాకేష్ తో వేములవాడలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.
- బాధిత కుటుంబానికి తామే ఇల్లు ఇచ్చామని.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రకటనలు
Vemulawada | వేములవాడ, నవంబర్ 27 : చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు నిజాంబాద్ లో ఉంటుండగా మరో కుమారుడు రాకేష్ తో వేములవాడలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రాకేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా పరిస్థితులు విషమించడంతో ఈనెల 6వ తేదీన అద్దె ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో బతికుండగానే కొడుకుతో స్మశాన వాటికకు చేరుకుంది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత 15రోజుల క్రితమే రాకేష్ మృతి చెందాడు. సొంత ఇల్లు లేక కన్నా కొడుకును బ్రతికి ఉండగానే స్మశానానికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడగా పలువురు నుండి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వచ్చాయి.

కొడుకు చనిపోయాక వచ్చిన ఇందిరమ్మ ఇల్లు..
ప్రస్తుతం కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితురాలు అమృతకు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు. కొడుకు చనిపోవడంతో ప్రస్తుతం రాజన్న ఆలయ వసతి గదుల్లో తల దాచుకుంటోంది. ఇక తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు కలెక్టర్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ మంజూరి పత్రాన్ని అందజేశారు. అయితే మంజూరైన ఇంటి నిర్మాణానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రకటనలు పోటాపోటీగా జారీ చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు సహాయాన్ని అందించాలని తాము పార్టీ నాయకత్వాన్ని ఆదేశించగా రూ.50వేల రూపాయల నగదు నిత్యావసర సరుకులు అందజేశామని, అలాగే బాధిత కుటుంబానికి కూడా ఇంటి నిర్మాణ పత్రాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు కేంద్ర మంత్రి ఫోన్ చేసినట్లు ప్రకటన జారీ చేశారు. మరోవైపు ఆది శ్రీనివాస్ చొరవతో ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేసిన ప్రకటనలు జారీ చేశారు. బాధితురాలు కొడుకు ఆరోగ్యానికి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి సహకరించిన ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు కూడా తెలిపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. బతికి ఉండగా సహాయం ఎలాగూ అందించలేకపోయారు కానీ చనిపోయిన తర్వాత మాత్రం బ్రతికున్న అమృతకు ఇంటి నిర్మాణపు అనుమతిని ఇచ్చారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం

