కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 2 : ఐఐటీ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. జాతీయస్థాయి లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. అజ్మీరా పురుషోత్తం నాయక్ 166వ ర్యాం కు, పీఎన్ సాయిధృవ 557, ఎన్ అనిరుద్సా యి 657, బీ ఆదిత్య 945, బీ విష్ణు 1203, ఎం అక్షిత 1224, వీ హృషికేష్ 1329, ఆర్ గోవర్ధన్ 1506, జే వామిక 1604, బీ చైశ్రవ్ రాజు 1640, ఈ శశిలాల్ 1899, కే వీరేంద్రప్రసాద్ 2120, డీ కార్తీక్‌రెడ్డి 2150, ఎస్ విఘ్నేష్ 229 3, డీ అభిరామ్ 2349, ఏ శశిప్రీతమ్ 2463, ఈ అంకిత్‌సాయి 2613, మహ్మద్ అబ్దుల్‌హక్ 2766, డీ విశాల్ 2917 ర్యాంకులు సాధించారు. వెయ్యిలోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
ఈ విషయాన్ని విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సోమవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లి కళాశాల ఆవరణలో అభినందించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి ఇం తటి ఘనవిజయానికి తోడ్పడ్డాయని చెప్పారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో సీట్లు సాధించే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. నీట్, ఎంసెట్‌లోనూ విద్యార్థులు అద్భుతంగా రాణించారని గుర్తు చేశారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.