కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 15 : చేనేత రంగ అభివృద్ధి కోసం ఇటీవల ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎస్ చరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు 60 సీట్లు కేటాయించారని వెల్లడించారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ దరఖాస్తులను tsht.telan gana.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం కరీంనగర్ మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్‌లో మొదటి అంతస్థులో ఉన్న తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.