Karimnagar | కమాన్ చౌరస్తా, మే 11 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో సోమవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని, బండి సంజయ్ తన కుమారుడిని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి, సాయి కృష్ణ, అజయ్, రాకేష్, అరుణ్, వినయ్, ఈశ్వర్, రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.