Rudrangi | రుద్రంగి, సెప్టెంబర్ 14: రుద్రంగి మండల కేంద్రంలోని గువ్వల బండ సమీపంలోని గోలపులొద్ది చెరువు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆదివారం పూర్తి స్థాయి మట్టం నిండి మత్తడి దూకుతోంది. చెరువు మత్తడి దూకడంతో నంది వాగు ద్వారా కళిగోట సూరమ్మ చెరువులోని నీటి ప్రవాహం పెరిగింది.
గతంలో జూలై నెలలోనే మత్తడి దూకిన చెరువులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోలపులొద్ది చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకడంతో చెరువు ఆయకట్ట కింద ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.