కరీంనగర్ కమాన్చౌరస్తా, మార్చి 11 : నిరుద్యోగ యువకులకు హైదరాబాద్లోని క్వాస్ క్రాప్ లిమిటెడ్లో ఉద్యోగాల కోసం ఈ నెల 13న గురువారం కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇయర్ ప్యాడ్స్ తయారీ, వైర్ హౌస్ ఆపరేటర్ పోస్టుకు ఇంటర్వ్యూలు ఉన్నాయన్నారు.
ఇందులో పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అభ్యర్థులు అర్హులని, వారి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలని సూచించారు. ఆసక్తి గల వారు కశ్మీర్గడ్డలోని ఈ సేవ కేంద్రం ఉన్న పై అంతస్తులో నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 95734 26092, 72076 59969, 99082 30384లో సంప్రదించాలని ఆయన సూచించారు.