శుక్రవారం 05 మార్చి 2021
Karimnagar - Jan 24, 2021 , 04:01:34

ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

 చొప్పదండి, జనవరి 23: పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం నగర కార్యదర్శి గూడెల్లి లక్ష్మీపతి, జిల్లా హాస్టల్స్‌ కన్వీనర్‌ ఆసిఫ్‌, పిట్టల రాజ్‌కుమార్‌, నాయకులు అజయ్‌, గజ్జెల రామకృష్ణ, ప్రమోద్‌, కార్తీక్‌, ఫయాజ్‌, దినేష్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

గంగాధర, జనవరి 23: మధురానగర్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి  మండల బీజేవైఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మండలానికి చెందిన సైనికుడు సంజీవ్‌, విశ్రాంత సైనికుడు మహేందర్‌ను సన్మానించారు. నాయకులు ఎడవెళ్లి శశిధర్‌రెడ్డి, మోతె శ్రీహరిరెడ్డి, వొడ్నాల వంశీ, దయ్యాల ప్రణయ్‌, వైద భరత్‌, శ్రీపతి రాజేంద్రప్రసాద్‌, వంశీరెడ్డి, శ్రీను, మనోహర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, అచ్యుత్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

రామడుగు, జనవరి 23: మండలంలోని గోపాల్‌రావుపేట, వెలిచాల, తదితర గ్రామాల్లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. గోపాల్‌రావుపేటలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు, వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వీర్ల సరోజన నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కమలాకర ఆనందం, కనుకయ్య, వినోద్‌, వంశీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, నాగరాజు, కార్తీక్‌, అజయ్‌, నరేశ్‌, రత్నాకర్‌, గంగయ్య, కరమ్‌చంద శివ, రాజు, ప్రవీణ్‌, తిరుపతి, వెలిచాల ఉప సర్పంచ్‌ పూదరి వెంకటేశ్‌, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 23: మొగ్దుంపూర్‌లోని నేతాజీ విగ్రహానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌  పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపసర్పంచ్‌ కుక్కట్ల తిరుపతి,  వార్డు సభ్యులు మాదాసు శివరామకృష్ణ, మైలారం వెంకటేశ్‌, శేఖర్‌, పవన్‌, అన్వేద్‌, రమేశ్‌, అజయ్‌, మహేశ్‌, సంతోష్‌, కూకట్ల రమేశ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo