శనివారం 30 మే 2020
Karimnagar - Jan 30, 2020 , 04:22:51

కిసాన్‌మేళా, ఆరోగ్య శిబిరానికి స్పందన

 కిసాన్‌మేళా, ఆరోగ్య శిబిరానికి స్పందన

చొప్పదండి, నమస్తేతెలంగాణ: మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో భారత్‌ పెట్రోలియం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కిసాన్‌మేళా, ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా ఎంపీపీ చిలుక రవి, సీఐ రమేశ్‌ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడూతూ  రైతులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కిసాన్‌మేళా, ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బంక్‌ నిర్వాహకుడు కళ్లెం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శంకర్‌, లింగయ్య, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, భారత్‌ పెట్రోలియం సేల్స్‌ అధికారి సోమేశ్వర్‌రావు, ఫీల్డ్‌కార్డు అధికారి హబీబ్‌, డీలర్లు రామకృష్ణారెడ్డి, గుర్రం విష్ణువర్ధన్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, ఆడెపు మహేందర్‌, వడ్లూరి వాసు, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు తొడుపునూరి లక్ష్మయ్య, జిల్లా సభ్యులు పెద్ది లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు. logo