దళితులు ఉన్నతంగా ఎదగాలి
దళితుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. నిన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఓనర్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. దళితులకు సర్కారు మరో శుభవార్త చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లను సర్కారు మంజూరు చేసింది
ప్రతి సెగ్మెంట్‌కు 1500 దళితబంధు యూనిట్లు
పదిరోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
వచ్చే నెల 11న జాబితా ప్రదర్శిస్తాం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కలెక్టరేట్లో పలు పథకాలపై అధికారులతో సమీక్ష
‘డబుల్’ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
దళితుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. నిన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఓనర్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. దళితులకు సర్కారు మరో శుభవార్త చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లను సర్కారు మంజూరు చేసింది. పదిరోజుల్లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, వచ్చే నెల 11న అన్ని నియోజకవర్గాల్లో జాబితా ప్రదర్శిస్తాం. పథకంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. అత్యంత పారదర్శకంగా అందిస్తున్నాం. దళితులు సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నతంగా ఎదగాలి.
– కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితులు ఉన్న తవర్గాలకు దీటుగా ఎదగాలని, ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1,500 దళితబంధు యూనిట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం నుంచి పది రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వచ్చే నెల 11న అన్ని నియోజకవర్గాల్లో జాబితాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలు శాఖల ప్రగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. బ్యాంక్ లింకేజీ లేకుండా మార్టిగేజ్ లేకుం డా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతా ల్లో రూ.10 లక్షల నగదు జమ చేస్తున్నారని చెప్పారు. దళితులు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు సీఎం కేసీఆర్‌ను ఆయన అభినందించారు.
ఈ పథకంతో దళితులు భవిష్యత్ తరాల్లో ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని చెప్పారు. వాహనాలు, డెయిరీ, ఫౌల్ట్రీ, కిరాణా దుకాణాలు, సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని దళితులు వాటికి యజమానులుగా మారుతున్నారని వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకుని ఇప్పటివరకు 10,202 మందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, ఇంకా 3,357 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా గ్రౌండింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం ప్రతి నియోజవర్గానికి 1,500 యూనిట్లు మంజూరు చేశామని, మంగళవారం నుంచి పది రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వచ్చే నెల 11న జాబితా ప్రదర్శిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు. జిల్లాలో దళిత బంధు పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా, దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్‌ను మంత్రి అభినందించారు.
- డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంపై మంత్రి గంగుల సమీక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 3 వేలు, కరీంనగర్లో 1,400, మానకొండూర్‌లో 891, చొప్పదండిలో 707 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా 789 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. వచ్చే గురువారం హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం ఉందని, అసంపూర్తి రోడ్లను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల గురించి నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి గంగుల ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
- మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద పలు గ్రామాల్లో 50, అల్గునూర్‌లో 16 ఇండ్లు పూర్తయ్యాయని, రామకృష్ణకాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు.
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గానికి 707 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. మిగిలిన నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.
- హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు 247 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా 243 పూర్తయ్యాయని, కోర్టు కేసులతో 4 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సైదాపూర్ హైలెవల్ వంతెన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కోరా రు.
- ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ దళితబంధు యూనిట్లను మంజూరు చేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంజూరైన 3వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా హుజూరాబాద్ అర్బన్‌లో 500, జమ్మికుంట అర్బన్‌లో 553, వీణవంక మండలంలో 59, ఇల్లందకుంటలో 50 నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు.
- జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ.. దళితబంధు కింద డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల కోసం పాడి పశువులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఎంపిక చేసుకోవాలని కోరారు.
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. రైతుబంధులాగానే దళితబంధు పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభించామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్‌లో 17,554మంది లబ్ధిదారులకు బ్యాం కుల్లో ఖాతాలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు 10,202 మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామన్నారు. యూనిట్లను విజయవంతంగా గ్రౌండింగ్ చేసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీ సురేశ్‌ను కలెక్టర్ అభినందించారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వా ల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఆర్అండ్బీ ఎస్ఈ చందర్, ఈఈ సాంబశివరావు, నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

