పెగడపల్లి, ఆగస్టు 11 : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని అతి పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంత్రి ‘నమస్తే’తో మాట్లాడుతూ, అపర భద్రాద్రిగా పేరున్న నంచర్ల రామాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తుల కోరిక మేరకు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. దీనిపై మంత్రి ఈశ్వర్‌కు ఎంపీపీ గోలి శోభ, నంచర్ల విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండి వెంకన్న, ఉపసర్పంచ్ తిరుపతియాదవ్, ఆలయకమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.