పెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 10: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం జిల్లా వ్యాపంగా 31సెంటర్లలో 5,007మంది కరోనా టీకా తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ తెలిపారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రాగినేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో కొవిడ్ టీకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో మంగళవారం 486 మందికి కొవిడ్ టీకాలు వేశారు. 291 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ మమత తెలిపారు. రాగినేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 395 మందికి కొవిడ్ టీకాలు వేశారు. 220 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ ఫణీంద్ర తెలిపారు. రాఘవాపూర్ పీహెచ్సీ సిబ్బందితో రాఘవాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ మమత, హెచ్‌ఈవో ఉమామహేశ్వర్, ఏఎన్ఎంలు ధనలక్ష్మి, సునీత, సుజారాణి, పద్మ, భాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, రజియా, సూపర్వైజర్ జయమణి, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 10: మండలంలోని మడిపల్లిలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అడిగొప్పుల రాణి మోహన్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, కూనారం వైద్యాధికారి డాక్టర్ మహేందర్, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
జ్యోతినగర్, ఆగస్టు 10: ఎన్టీపీసీ పట్టణ పరిధి మూడో డివిజన్ న్యూపోరట్పల్లిలోని కమ్యూనిటీహాల్లో మంగళవారం డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. రామగుండం పీఎస్ వైద్య సిబ్బంది కరోనా మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ టీకా వేశారు. కార్యక్రమంలో రామగుండం పీఎస్ డాక్టర్ కృష్ణవేణి, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి బర్ర శంకర్‌గౌడ్, గోషిక శ్రీనివాస్ తదితరులున్నారు.