యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 10: సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పా) బలరాం కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందు లో ఆర్జీ-2 ఏరియా జీఎం టి.వెంకటేశ్వర్రావు పాల్గొని డివిజన్లో కొవిడ్ వ్యాక్సిన్‌పై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు కొవిడ్ విస్తరించకుండా గనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటైజర్‌ను తప్పనిసరిగా గనులపై అం దుబాటులో ఉంచాలని సూచించారు. కాంట్రాక్టు కార్మికులకు టీకా వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. డివిజన్లో ఇప్పటివరకు 3,661మందికి మొదటి డోసు, 750 రెండో డోసు వేసినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్వోటూ జీఎం సాంబయ్య, సివిల్ డీజీఎం ధనుంజయ, అధికార ప్రతినిధి అనిల్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమి, ఐటీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, ఆగస్టు 10: సింగరేణిలో కొవిడ్ టీకాలపై సంస్థ డైరెక్టర్ బలరాం సమీక్షించారు. అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఏరియాలో మూడో దశ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క రూ రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకునేలా ఏర్పా ట్లు చేయాలని సూచించారు. వీహెచ్‌వో చేసిన హెచ్చరికల దృష్ట్యా సింగరేణిలో చేపట్టాల్సిన నివారణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. జీఎం కె.నారాయణ మాట్లాడుతూ.. ఆర్జీ-1 ఏరియాలో ఇప్పటివరకు 4,482 మంది సింగరేణి ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఉద్యోగులు, ఇతరులు 6,003 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. సమావేశంలో పర్సనల్ డీజీఎం లక్ష్మీనారాయణ, కిరణ్ రాజ్‌కుమార్ ఉన్నారు.