శుక్ర, ఆది, సోమవారాల్లో అందుబాటులో..
ప్రారంభించిన చైర్పర్సన్ మాధవి
వేములవాడ, అక్టోబర్8: వేములవాడ రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయానికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం మినీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్ర, ఆది, సోమవారాల్లో ఉద యం నుంచి రాత్రిదాకా బస్టాండ్ నుంచి పార్వతీపురం వరకు మినీ బస్సు అందుబాటులో ఉం టుందన్నారు. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ సహకారంతో రాజన్న భక్తులకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఆర్టీసీ డీఎం భూపతిరెడ్డి, ఆలయ ఈఈ రాజేశ్, వైస్ చైర్మన్ మధురాజేందర్, కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి రాంచందర్, గోలి మహేశ్, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, బబూన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహ్మద్, నాయకులు రామతీర్థపు రాజు, పుల్కం రాజు, కుమ్మరి శ్రీనివాస్, పెంట బాబు, గుడూరి మధు, మల్లేశం తదితరులు ఉన్నారు.