ముస్తాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు అధిక సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్‌రావు నివాసంలో పార్టీ మండలాధ్యక్షుడు భూంపెల్లి సురేందర్‌రావు అధ్యక్షతన మంగళవారం కార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 64మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ప్రజాప్రతినిధులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు మాట్లాడారు. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయిస్తున్న సీఎం కేసీఆర్, దేశ ప్రజల దృష్టిని జిల్లా వైపు చూసేలా అభివృద్ధి చేస్తున్న మంత్రి కేటీఆర్‌పై అభిమానంతో యువత అధిక సంఖ్య లో పార్టీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. బండి సంజయ్ చేపట్టిన సంగ్రా మ యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. ఇక్కడ సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎంసీ చైర్పర్సన్ శీలం జానాబాయి, సర్పంచుల ఫోరం మం డలాధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు, పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ నేతలు ఏనుగు విజయరామారావు, సర్వర్‌పాషా, బత్తుల అంజ య్య, శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌రావు, జహంగీర్, అంజన్‌రావు, భరత్, అన్వర్, శ్రీనివాసరెడ్డి, నవాజ్, నర్సయ్య ఉన్నారు.