స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021లో జగిత్యాల జిల్లా జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు, రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినందుకు కలెక్టర్ రవికి పలువురు ప్రముఖులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
అంతకు ముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, జల్ద అరుణశ్రీ, ఇతర అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందచేసి ఘనంగా సత్కరించారు.
-జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 23