నేటి నుంచి మూడురోజులపాటు జాతర
భారీగా తరలిరానున్న భక్తజనం
కార్పొరేషన్, ఫిబ్రవరి 15: బుధవారం నుంచి మూడురోజుల పాటు జరిగే రేకుర్తి సమ్మక్క-సారలమ్మ జాతరకు కరీంనగర్‌లోని రేకుర్తి ముస్తాబైంది. మంగళవారం గద్దెల వద్ద స్థానిక కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుల్ల రాజశేఖర్, జాతర కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఎదురోళ్లు నిర్వహించారు. బుధవారం సారలమ్మ గద్దెకు చేరనున్నది. గురువారం సమ్మక్క గద్దెకు రానున్నది. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
గంగాధర, ఫిబ్రవరి 15: మండలంలోని మధురానగర్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను గంగాధర విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు మంగళవారం పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు వేముల దామోదర్, నాయకులు వేముల అంజి, తోట మహిపాల్, ఆకుల మధుసూదన్, జారతి సత్తయ్య, పెంచాల చందు, నిమ్మనవేణి ప్రభాకర్, గుండవేణి తిరుపతి, మ్యాక వినోద్ తదితరులున్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 15: బొమ్మకల్‌లోని హౌసింగ్ బోర్డు, ఇరుకుల్ల, నగునూర్ గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు తోట మోహన్, సీహెచ్ సాగర్, మిర్యాల్కర్ నరేందర్, బొల్లం లింగమూర్తి, నందుకుమార్, ఆనంద్, కుంటల మధు, మల్లెపూల సుధాకర్, కూడల నవీన్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.