తెలంగాణచౌక్, ఫిబ్రవరి 15: తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌక్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. సీపీం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమాసాహెబ్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేశ్పటేల్, కార్యదర్శి తిరుపతి, నాయకులు మోహన్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 15: శాతవాహన విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ కే శ్రీవాణి, స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ హరికాంత్, సుజాత, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాఫర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయంతి, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ మునావర్, ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, హుమేరా తస్నీమ్, డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ యశ్వంత్‌రావు పాల్గొన్నారు.