సంక్షోభంలోనూ సంక్షేమం

- ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి
- కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
చిట్యాల జనవరి 21 : లాక్డౌన్ సమయంలో సంక్షోభం ఏర్పడినా ప్రజలకు సంక్షేమం అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి అధ్యక్షతన, తహసీల్దార్ ఆధ్వర్యంలో చె క్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ము ఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 51 మందికి కల్యాణలక్ష్మి, 17 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆయా గ్రా మాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు తక్కువైనప్పటికీ ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా చెల్లింపునకు వెనుకాడకుండా లబ్ధిదారులకు అందజేశామన్నారు. రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులతో మా ట్లాడి కేసీఆర్ కిట్ అందిందా, ప్రభుత్వం వైద్యం ఎలా ఉందని ప్రశ్నించగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాటర్ ప్లాంట్ పునరుద్ధరించాలని స్థానికులు అడుగగా ఎమ్మె ల్యే చేయిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీడీవో రవీంద్రనాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు కుంభం రవీందర్‌రెడ్డి, ఆరెపల్లి మల్లయ్య, కో ఆప్షన్ సభ్యుడు రాజమహ్మద్, సర్పంచ్ పూర్ణ చందర్రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మానరేందర్, టౌ న్ ప్రెసిడెంట్ పాండ్రాల స్వామి పాల్గొన్నారు.
భూపాలపల్లిలో..
భూపాలపల్లి టౌన్, జనవరి 21 : కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన చెక్కులను గురువారం గణపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. 44 కల్యాణలక్ష్మి, 27 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని కోరారు. కార్యక్రమంలో గణపురం పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
- దేశీ వ్యాక్సిన్ : బీజేపీ ఆరోపణలు తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం