e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జనగాం ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు చేరాలి

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు చేరాలి

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు చేరాలి

మిషన్‌ భగీరథ అధికారులు,
ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రెడ్యా సమీక్ష

కురవి, ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ నీరు పది రోజుల్లో ప్రతి ఇంటికీ చేరాలని, తద్వారా నీటి సమస్య తీరాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కురవి ఎంపీడీవో కార్యాలయంలో మిషన్‌భగీరథ చీఫ్‌ ఇంజినీర్‌ విజయప్రకాశ్‌తో కలిసి ఎమ్మెల్యే కుర వి, డోర్నకల్‌ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకువచ్చిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, మి షన్‌ భగీరథ పథకాలతోనే నేడు రాష్ట్రంలో కరోనా కట్టడి జరిగిందన్నారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి స మస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నో ప్రయాసాలకు ఓర్చి 250 కిలోమీటర్ల పైపు లైన్లు మంజూరు చేయించామన్నారు. వాటితోనే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పదిరోజుల్లో పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్ని గ్రామా ల్లో జనాభా ప్రాతిపదికన సరిపోయే ట్యాంకులు లే వని, ఉన్న ట్యాంకులకే రెండు మూడు షిప్టులు నీ రు ఇవ్వాలని సూచించారు. కురవి మండలం మో ద్గులగూడెం, జుజ్జూరుతండా, బేగావత్‌తండాల్లో తాగునీటి సమస్య తీర్చకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లేదన్నారు. సహకరించని కార్యదర్శులను వేరే గ్రామాలకు పంపించాలని ఎం పీడీవోను ఆదేశించారు. నేరడ శివారు తండాలకు నీరు రావడంలేదని మరో ట్యాంకు కావాలని, తట్టుపల్లి గ్రామానికి మరో ట్యాంకు కావాలని అధికారులకు ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచులు శ్రీనివాస్‌, రాంరెడ్డి వినతి పత్రం సమర్పించారు. కురవి ఎంపీటీసీ భాస్కర్‌ కురవిలోని గాంధీ బజార్‌లోని ట్యాం కు వద్ద పైపులైన్‌ మార్చాలని, మండల కేంద్రంతోపాటు ఆలయం ఉండడం వల్ల పెరిగిన జనాభాను గుర్తించి మరో రెండు ట్యాంకులను మంజూరు చేయాలన్నారు. అనంతరం డోర్నకల్‌ మండలంలోని గ్రామాల వారీగా ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. డోర్నకల్‌ మున్సిపల్‌ కేంద్రంలో నీటి సరఫరా జరగడంలేదని, గత సమావేశంలోనే అధికారుల దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కరించలేదని మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుని లక్ష్యంలోపు ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.


కురవి ఎంపీపీ గుగులోత్‌ పద్మావతీరవినాయక్‌, డోర్నకల్‌ ఎంపీపీ డీఎస్‌ బాలునాయక్‌ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానుకోట ఎఎంసీ చైర్మన్‌ బజ్జూరి ఉమ, డోర్నకల్‌ జడ్పీటీసీ కమలారామనాథం, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, మరిపెడ ఆత్మ చైర్మన్‌ తోట లాలయ్య, మిషన్‌భగీరథ ఎస్‌ఈ రాములు, ఈఈ గ్రిడ్‌ సురేందర్‌, ఈఈ ఇంట్రా కృష్ణారెడ్డి, ఎంపీడీవోలు ధన్‌సింగ్‌, వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ ఎం రమేశ్‌, వై సుధాకర్‌రెడ్డి, నర్సింహారావు, పీఎసీఎస్‌ చైర్మన్లు గోవర్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీదేవి, గుగులోత్‌ రవి, వైస్‌ ఎంపీపీలు దొంగలి నర్సయ్య, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ గణేశ్‌, కురవి ఆలయ చైర్మన్‌ రామునాయక్‌, మాజీ చైర్మన్‌ రాజు, రాంచంద్రయ్య, ఎంపీవోలు విజయలక్ష్మి, మునవర్‌బేగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు ప్రీతి, అరుణ, హన్మంతు, కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

కొవిడ్ వార్డును పరిశీలించిన ఎమ్మెల్యే రామన్న

18 ఏండ్లు దాటిన అంద‌రికీ వ్యాక్సిన్‌.. సుప్రీంకోర్టులో పిల్..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు చేరాలి

ట్రెండింగ్‌

Advertisement