మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jan 22, 2021 , 02:07:57

ఆరోగ్య శాఖ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌

ఆరోగ్య శాఖ సిబ్బందికి  కరోనా వ్యాక్సినేషన్‌

నర్మెట, జనవరి 21 : కరోనా నివారణకు జిల్లాలో ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇస్తున్న వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నర్మెట మండలంలోని 80 మంది అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు గురువారం వైద్యుడు మోజస్‌రాజ్‌ పర్యవేక్షణలో టీకాలు వేశారు. కార్యక్రమంలో హెల్త్‌సూపర్‌వైజర్‌ శోభారాణి, లూర్దుమేరీ, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండలంలోని ఐసీడీఎస్‌ సిబ్బందికి గురువారం కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కర్రె నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో 126 మందికి టీకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కరోనా నివారణకు అందరూ జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిద్ధార్థరెడ్డి, వ్యాక్సినేషన్‌ అధికారులు గణపురం కవిత, బొడిగం వనజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

దేవరుప్పులలో..

దేవరుప్పుల : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కరోనా వ్యాక్సినేషన్‌ శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి అనూషారెడ్డి నేతృత్వంలో ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, 27 మంది ఆయాలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ భాగ్యమ్మ,  ఏఎన్‌ఎం దేవేంద్ర, జ్యోతి, రాజశేఖర్‌, శ్రీనాథ్‌, కవిత, ఎల్‌టీ మహేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

రఘునాథపల్లిలో..

రఘునాథపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 39 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చామని మండల వైద్యాధికారి డాక్టర్‌ స్రవంతి తెలిపారు. మండలంలో మొత్తం 71 మంది అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వా ల్సి ఉండగా అందుబాటులో ఉన్న 39 మందికి ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బిక్కూనాయక్‌, పండరి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo