శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 16, 2020 , 01:44:12

బీజేపీ నాయకులపై కేసు నమోదు

బీజేపీ నాయకులపై కేసు నమోదు

జనగామ క్రైం, జూలై 15: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సిద్దిపేట రహదారిపై బుధవారం బైఠాయించి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసన చేపట్టిన తొమ్మిది మంది బీజెపీ శ్రేణులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు కలడంతో జనగామ బీజేపీ పట్టణ అధ్యక్షుడు వారణాసి పవన్‌ శర్మ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బొట్ల శ్రీనివాస్‌, జంగా రాజా వెంకటనర్సింహరెడ్డి, నిమ్మల మధు, గొరిగె సంపత్‌, పిట్టల సత్యం, సానబోయిన మైపాల్‌, ఆకుల క్రాంతి కుమార్‌, నల్ల బాబుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

బాలిక అదృశ్యం

జనగామ క్రైం, జూలై 15: తమ కూతురు శ్వేత (17) ఈనెల 14న సాయంత్రం 5.30 గంటల నుంచి కనిపించడంలేదని శామీర్‌పేట గ్రామానికి చెందిన మానెగల్ల మహేందర్‌ బుధవారం ఫిర్యాదు చేసినట్లు అర్బన్‌ సీఐ మల్లేశ్‌ తెలిపారు. ఆయన కథనం.. దగ్గరి బంధువుల ఇళ్లలో వెతికినా జాడ తెలయలేదు. జనగామ ఎస్సై సీహెచ్‌ రవి కుమార్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ పేర్కొన్నారు.

VIDEOS

logo