ఆదివారం 01 నవంబర్ 2020
Jagityal - Sep 28, 2020 , 02:51:41

‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’

‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’

రాయికల్‌ రూరల్‌ : మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిషలు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం రాయికల్‌లోని లక్ష్మి గార్డెన్‌లో ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన గేదెలకు నష్టపరిహారం, 38 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే  ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాజీపేట్‌లో విద్యుత్‌ షాక్‌తో 15 బర్రెలు మృతి చెందడంతో ఆర్థికంగా నష్టపోయిన ఒక్కొక్కరికి రూ. 40 వేల చొప్పున 15 మందికి అందజేశామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో కుమ్మరిపెల్లి, రాయికల్‌లో ఏర్పాటు చేసిన పోషణ్‌ అభియాన్‌ వారోత్సవాల్లో పాల్గొన్నారు. న్యూట్రీ గార్డెన్‌ కార్యక్రమంలో భాగంగా కుమ్మరిపెల్లిలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కూరగాయల విత్తనాలు నాటారు. ఆయా కార్యమాల్లో ఎంపీపీ సంధ్యారాణి, అశ్విని, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, ఏఎంసీ చైర్మన్‌ రాజారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచులు రమాదేవి, స్వప్న, జీవన్‌రెడ్డి, తిరుపతి, ఎంపీటీసీలు నాగరాజు, విజయలక్ష్మి, సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు రాజేశ్‌, హుస్సేన్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.