సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 02, 2020 , 02:32:12

గ్రామాలను ‘బాలమిత్ర’లుగా తీర్చిదిద్దాలి

గ్రామాలను ‘బాలమిత్ర’లుగా తీర్చిదిద్దాలి

కార్పొరేషన్‌ : కరీంనగర్‌ ఉమ్మడి జి ల్లాలో ప్రతి గ్రామాన్నీ బాలమిత్ర గ్రా మంగా తీర్చిదిద్దేవిధంగా కృషి చే యాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు వినోద్‌కుమార్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్‌ ఒక దురదృష్టకర సమస్య అని, ఈ మహమ్మారి ప్రభావం అట్టడుగున ఉన్న పిల్లలపై పడకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నా రు. పిల్లల భవిష్యత్‌ కోసం నిర్విరామం గా కృషి చేయాలన్నారు. కరోనా వైరస్‌ గ్రామాలు, పట్టణాల్లోని పేద కుటుంబాల పిల్లల ఆర్థిక పోషణ కష్టతరమవుతుందన్నారు. దీని వల్ల పిల్ల లు బడి మానేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని బాల కార్మికులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని పేద పిల్లల సమస్యలు పెరుగుతుండటాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తగిన కృషిచేసి బాలమిత్ర గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో కృషిచేసి బాలమిత్ర గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చని సూచిం చారు. ప్రతి గ్రామ ప్రజాప్రతినిధి తమ గ్రామాలను బాల కార్మికులు లేని, బా ల్య వివాహాలు లేని, బాలలపై ఎలాంటి హింస జరగని గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి, బాలలకు విద్యనందించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. logo