మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 30, 2020 , 02:11:31

గాయపడ్డ యువకుడికి మాజీ ఎంపీ కవిత అండ

గాయపడ్డ యువకుడికి మాజీ ఎంపీ కవిత అండ

  • ట్విట్టర్‌లో చూసి రూ. 10 వేల ఆర్థిక సాయం

జగిత్యాల రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ట్విట్టర్‌ ద్వారా తెలుసుకొని రూ.10వేలు అందజేసి మా తృత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాలలోని తారకరామనగర్‌కు చెందిన విఘ్నేష్‌ నాలుగురోజుల కిందట ధరూర్‌ వద్ద బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అదే కాలనీకి చెందిన సుమన్‌ విఘ్నేష్‌ ఫొటోతో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. స్పందించిన కవిత సుమన్‌కు ఫోన్‌చేసి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు దావ సురేశ్‌ ద్వారా బుధవారం నగదును అందించారు. విఘ్నేష్‌ చికిత్స కోసం అవసరం మేరకు సాయం చేస్తానని కవిత హామీ ఇచ్చారని సురేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ షేక్‌ చాంద్‌ పాషా, కోటగిరి మోహన్‌, కృష్ణమూర్తి, చంద్రమౌళి ఉన్నారు.


logo