లండన్, జనవరి 23: సైబీరియాలో వేల ఏండ్లుగా మంచుకింద నిక్షిప్తమై ఉన్న జాంబీ వైరస్ మళ్లీ పునరుజ్జీవం పొంది మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూతాపం, షిప్పింగ్, మైనింగ్ వంటి మానవ కార్యకలాపాల వల్ల జాంబీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టు తాజా అధ్యయనం పేర్కొన్నది.
ఫ్రాన్స్‌కు చెందిన ఎయిక్స్-మార్సిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా 2023 నమోదైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో భూమి వేడెక్కిన నేపథ్యంలో జాంబీ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.