వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు అమెజాన్ ప్రకటించిన కొద్ది గంటలకే, తాము కూడా యూఎస్‌లో సిబ్బందిని భారీగా తొలగించనున్నట్టు గూగుల్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ ప్రకటించింది.
అయితే ఇలా ఎంతమందిని తొలగించేది అధికారికంగా వెల్లడించ లేదు. ఉద్యోగులకు కంపెనీ ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ కార్యక్రమాన్ని ప్రకటించింది. కంపెనీకి రిజైన్ చేయాలనుకునే వారికి యుక్తమైన ప్యాకేజీ అందిస్తామని పేర్కొంది.