క్యాన్బెరా: నువ్వు నాకు రాజువు కాదు అంటూ.. ఆస్ట్రేలియా సేనేటర్ లిడియా థోర్స్ .. ఆ దేశ పార్లమెంట్(Australia Parliament)లో కేకలు పెట్టారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఇవాళ ఉదయం క్యాన్బెరాలోని పార్లమెంట్లో ప్రసగించారు. అయితే ఆయన ప్రసంగం ముగియగానే.. అక్కడ ఉన్న అబొరిజినల్ తెగకు చెందిన మహిళా ఎంపీ లిడియా థోర్ప్ నినాదాలు చేశారు. రాచరిక వ్యవస్థను ఆమె వ్యతిరేకించారు. ఎంపీ లిడియా అరుస్తున్న సమయంలో అక్కడ ఉన్న సెక్యూర్టీ ఆమెను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Indigenous senator Lidia Thorpe yells at King Charles after he finished giving a speech at the Australian Parliament:
“You committed genocide against our people, give us our land back! Give us what you stole from us! You are not our King!”
— Pop Base (@PopBase) October 21, 2024
మా ప్రజలపై మీరు ఊచకోతకు పాల్పడ్డారని, ఇది మీ నేల కాదు అని, నువ్వు నాకు రాజువు కాదు అని ఆ ఎంపీ అరిచారు. కానీ అబొరిజినల్ తెగ నేత ఆంటీ వయోలెట్ షెర్డియాన్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. రాజు, రాణిని లిడియా అవమానించారని వయోలెట్ పేర్కొన్నారు. ఆమె తమ తెగ తరపున మాట్లాడలేదన్నారు. బ్రిటన్ పాలించిన కామన్వెల్త్ దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అక్కడి ప్రభుత్వానికి అధినేత బ్రిటన్ కింగే ఉంటారు. ఈ నేలపై పుట్టిన వాళ్లకే సార్వభౌమాధికారం ఉండాలని, ఆ రాజు ఈ నేలవాడు కాదు అని ఆమె అన్నారు. బ్రిటీష్ పాలకులకు తలవంచబోమని, ఎందుకంటే వాళ్ల పూర్వీకులు సామూహిక జన హననానికి పాల్పడినట్లు లిడియా ఆరోపించారు.
9 రోజుల పర్యటన నిమిత్తం.. కింగ్ చార్లెస్ తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలో విహరిస్తున్నారు.