ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం కూడా లేదని జిన్పింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య శుక్రవారం వర్చువల్ సంభాషణ జరిగింది.
ప్రపంచంలో శాంతి నెలకొలిపే బాధ్యతను ఇరు దేశాలూ భుజాలకెత్తుకోవాలని జిన్పింగ్ కోరారు. అయితే ఏ దేశాల మధ్య అయినా సంబంధాలు యుద్ధం వైపుకు దారితీయవద్దని, శాంతియుతంగానే వుండాలని జిన్పింగ్ పేర్కొన్నారు. శాంతి, భద్రత అనేవి ప్రపంచ దేశాలు పెద్ద సంపద లాంటివని, అవి భగ్నం కాకుండా చూడాలని జిన్పింగ్ కోరారు.