అమెరికాలోని న్యూయార్క్ నగరం.. ఆకాశ హర్మ్యాలకు చాలా ఫేమస్. అయితే ఇటీవల ఓ పెద్ద భవన నిర్మాణం పూర్తయింది. అందులో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఫొటో మధ్యలో స్తంభం మాదిరిగా కనిపిస్తున్నది చూడండి. అదే ఈ ఆకాశ హర్మ్యం. ఇది ప్రపంచంలోనే చాలా బక్క పలుచటి భవనంగా పేరొందింది. దీని ఎత్తు, వెడల్పు నిష్పత్తి ఎంతో తెలుసా.. 24ః 1 మాత్రమే. ఈ భవనం 1428 అడుగుల ఎత్తు ఉంది. 84 ఫ్లోర్లలో 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్ ఖరీదు కనీసం రూ.60 కోట్లు.