Ethel Caterham | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఎథెల్ కాటర్హామ్ (Ethel Caterham) తన 116వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. గురువారం (ఆగస్టు 21న) సర్రేలో లైట్వాటర్లోని సంరక్షణ కేంద్రంలో కుటుంబ సభ్యుల నడుమ చాలా సాదాసీదాగా వేడుకలు చేసుకున్నారు. ఈ మేరకు హల్‌మార్క్ కేర్ హోమ్స్ శుక్రవారం వెల్లడించింది. ఎథెల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లివెత్తాయి. బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ ఇనా కాన్బారో లూకాస్ (116) (Sister Inah Canbarro Lucas) మరణించడంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఎథెల్ ఖ్యాతి గడించారు.
ఎథెల్ కాటర్హామ్
1909, ఆగస్టు 21న ఎథెల్ కాటర్హామ్ జన్మించారు. అంటే టైటానిక్ విపత్తుకు సరిగ్గా మూడేండ్ల ముందు ఆమె జన్మించారు. భారత్‌తోనూ ఆమెకు అనుబంధం ఉన్నది. తన 18వ ఏటా భారత్‌కు వచ్చిన ఆమె ఒక సైనిక కుటుంబానికి సహాయకురాలిగా విధులు నిర్వహించారు. కొద్ది రోజుల తర్వాత ఆమె స్వదేశానికి వెళ్లిపోయారు. 1933లో నార్మన్ కాటర్హామ్ను వివాహం చేసుకున్నారు.
ఎథెల్ కాటర్హామ్
అనంతరం హాంకాంగ్‌కు తరలివెళ్లారు. అటునుంచి జిబ్రాల్టర్కు మకాం మార్చారు. చివరకు దక్షిణ ఇంగ్లాడ్‌లో స్థిరపడ్డారు. 1976లో 60 ఏండ్ల వయస్సులో ఆమె భర్త నార్మన్ కాటర్ హామ్ మరణించారు. కాగా, ఎథెల్ కాటర్హామ్కు ముగ్గురు మనవళ్లతోపాటు ఐదుగురు ముని మనవళ్లు ఉన్నారు.
ఎథెల్ కాటర్హామ్
కాగా, ప్రపంచంలో అత్యధికాలం బతికిన వ్యక్తిగా ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్ (Jeanne Calment) గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. ఆమె 1997, ఆగస్టు 4న తన 122వ ఏటా మరణించారు. కాల్మెంట్ 122 సంవత్సరాల 164 రోజులు జీవించారు.
జీన్ కాల్మెంట్