ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క
- 180 కిలోమీటర్లలో విస్తరణ..
- ఆస్ట్రేలియాలో గుర్తింపు
కాన్బెర్రా, జూన్ 2: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. 4,500 ఏండ్ల నాటిదిగా భావిస్తున్న ఈ మొక్క పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోని ‘షార్క్బే’లో నీటి అడుగున పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ మొక్క 180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాప్తించి ఉంటుందని అంచనా. అంటే గ్లాస్గొ నగరం కంటే పెద్ద విస్తీర్ణం అన్నమాట. ఈ మేరకు అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ పెద్ద మొక్క గుర్తింపు అనుకోకుండా జరిగిందని, షార్క్ బేలోని సముద్రపు గడ్డి జన్యువైవిధ్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఇది వెలుగుచూసిందని పరిశోధకులు పేర్కొన్నారు. మొదటగా ఈ మొక్కను పెద్ద సముద్రపు గడ్డి మైదానంగా భావించారు. ఒకే విత్తనం నుంచి ఈ మొక్క అంతా వ్యాప్తించినట్టు తర్వాత గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

