ప్రపంచంలోనే అతిపెద్ద బాక్టీరియా థయోమార్గిటా మాగ్నిఫికా చిత్రం ఇది. దీని పొడవు దాదాపు ఒక సెంటీమీటర్. సూక్ష్మదర్శిని సాయం లేకుండానే దీన్ని చూడవచ్చు.
కరీబియన్ దీవుల్లో ఇటీవలే దీన్ని కనుగొన్నారు. సాధారణ బాక్టీరియా కంటే ఇది 5వేల రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. బాక్టీరియాల్లో కణజాలాల పెరుగుదలపై ఇప్పటి వరకు ఉన్న అధ్యయనాలను ఇది సవాలు చేస్తున్నట్టు తెలిపారు.