వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ మహిళ చాట్‌జీపీటీ ఉపయోగించి పవర్‌బాల్ లాటరీలో 1,50,000 అమెరికా డాలర్లను(సుమారు రూ.1.3కోట్లు) గెలుచుకున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, సెప్టెంబర్ 8న వర్జీనియా పవర్బాల్లో పాల్గొన్న క్యారీ ఎడ్వర్డ్స్, చాట్‌జీపీటీ సహాయంతో ఎంచుకున్న సంఖ్యలోని నాలుగు నంబర్లు ‘పవర్‌బాల్’కు సరిపోయాయి.
పవర్ ప్లేలో కూడా ఆట కొనసాగించగా.. 1,50,000 డాలర్లు ఆమె సొంతమైంది. లాటరీలో గెలుచుకున్న ఈ మొత్తాన్ని దాతృత్వ సంస్థకు విరాళంగా అందజేస్తున్నట్టు ప్రకటించి, ఆమె తన గొప్ప మనసు చాటుకుంది.