ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 17:21:04

కొండ‌చిలువ‌ను ఉతికిపారేసిన మ‌హిళ‌.. పాపం అది కొండ‌చిలువ‌ని తెలియ‌ద‌ట‌!

కొండ‌చిలువ‌ను ఉతికిపారేసిన మ‌హిళ‌.. పాపం అది కొండ‌చిలువ‌ని తెలియ‌ద‌ట‌!

కొన్ని సంఘ‌ట‌న‌లు విన్న‌ప్పుడు చాలా విడ్డూరంగా ఉంటాయి. విన‌గానే అలా ఎలా అనుకున్న‌ది. ఆ మాత్రం తెలియ‌దా అంటూనే ఒక్కోసారి వారు కూడా మోస‌పోతుంటారు. అయితే ఎమిలీ అనే మ‌హిళ బ‌ట్ట‌ల‌ను వాషింగ్ మెషీన్‌లోనే ఉతుకుతుంది. అయితే ఉద‌యాన్నే బెడ్‌షీట్లు, బ‌ట్ట‌ల‌ను మెషీన్‌లో వేసినా ఇంకా ఆన్ చేయ‌లేదు. కొన్ని గంట‌ల త‌ర్వాత వాషింగ్ మెషీన్ ఆన్ చేసి పెట్టేసింది. లోడ్ అయిన త‌ర్వాత బెడ్‌షీట్ల‌ను ఆరేయ‌డానికి డోర్ ఓపెన్ చేసి రంగురంగులుగా క‌నిపిస్తున్న షీట్ మెషీన్ నుంచి బ‌య‌ట‌కు లాగింది. అది కాస్త వెచ్చ‌గా,  మందంగా, బ‌రువుగా ఉండ‌టంతో గుండె ల‌బోదిబో కొట్టుకోవ‌డం ప్రారంభ‌మైంది. తీరా ఏంట‌ని చూసేస‌రికి కొండ‌చిలువ‌. ఇంకేముంది కెవ్వు....మ‌ని అరిచి దాన్ని వాషింగ్ మెషీన్‌లోనే వేసి అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు కాల్ చేసింది. వెంట‌నే వారు వ‌చ్చి కొండ‌చిలువ‌ను బంధించారు.

మెషీన్‌లో అన్ని తిప్పులు తిరిగినా కొండ‌చిలువ సేఫ్‌గానే ఉండ‌డంతో వారు దానిని అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండ‌చిలువ వాషింగ్ మెషీన్‌లోకి ఎలా దూరిందో ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు. డోర్ల‌న్నీ మూసేసున్నాయి. ఇంత‌పెద్ద‌ది ఎవ‌రికీ క‌నిపించ‌కుండా లోప‌లికి రావ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు. ఇది జ‌రిగి చాలాసేపు అయినా మ‌హిళ కాళ్లు, చేతులు వ‌ణుకుతున్నాయి. ఈ ఘటన ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో చోటుచేసుకుంది. కొండ‌చిలువ‌లు వాషింగ్‌మెషీన్‌లోనే కాదు. టాయిలెట్‌లోనే ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి వాష్‌రూంకి వెళ్లేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే వాటికి బ‌లి అవ్వాల్సిందే. 


logo