చాలామంది తమ పూర్తి పేరు చెప్పుకోవడానికి సందేహిస్తారు. ఎందుకంటే.. కొందరి పూర్తి పేరు పొడుగ్గా ఉంటుంది. అందులో ఇంటిపేరు కూడా ఉంటుంది కాబట్టి.. తమ పేరును షార్ట్ చేసుకొని దాన్నే ఎక్కువగా వాడుతుంటారు. తెలిసినవాళ్లు, ఇంట్లో వాళ్లు కూడా ఎక్కువగా షార్ట్ నేమ్‌తోనే పిలుస్తుంటారు.
కానీ.. ఓ మహిళ పేరు మాత్రం ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఎంత పెద్దది.. అంటే ఆ పేరును ఈ జన్మలో కూడా గుర్తుపెట్టుకోలేం. తనను సొంత పేరుతో ఎవ్వరూ పిలవలేరు. తన పూర్తి పేరుతో రాసి ఇచ్చినందుకు తన బర్త్ సర్టిఫికెటే 2 ఫీట్ల పొడవు ఉంది.
ఇక తన పేరును పలకడం కూడా కష్టమే. కానీ.. అందరూ తనను ముద్దుగా జామీ(Jamie) అని పిలుస్తారు. తను 1984లో జన్మించింది. యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన జామీ పుట్టిన తర్వాత తనకు మంచి పేరు పెట్టాలనుకున్నారు తన తల్లిదండ్రులు. అయితే.. అనుకోకుండా తన బర్త్ సర్టిఫికెట్లో Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams అని రాశాడు జామీ తండ్రి. పేరు తప్పుగా పడిందని బర్త్ సర్టిఫికెట్లో దాన్ని సవరించేందుకు అప్లయి చేసుకోగా.. పేరు ఇంకా పెద్దదయింది కానీ.. తగ్గలేదు. ఆ తర్వాత పేరులో 1019 లెటర్స్ చేరాయి. తన మిడిల్ నేమ్‌లోనే 36 లెటర్స్ ఉన్నాయి. అప్పటి నుంచి తన పేరును అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చింది జామీ.
ఆ తర్వాత తన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరుగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది జామీ.
తనకు అందరి లాంటి పేరు పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. తన పేరు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండకూడదు అనుకున్నా. అందుకే తన పేరును యూనిక్‌గా ఉండేలా పెట్టాము. తను గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలని అనుకున్నా.. అంటూ 1997లో ఓ ఇంటర్వ్యూలో జామీ తల్లి సాండ్రా చెప్పుకొచ్చింది. అప్పుడు జామీ వయసు 12 ఏళ్లు మాత్రమే.
The longest name to appear on a birth certificate is Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams.#OTD in 1984, her father looked to extend her first name to 1,019 letters and her middle name to 36 letters. pic.twitter.com/XG6iUMi237
— Guinness World Records (@GWR) October 5, 2020
ఎప్పుడైతే జామీ బర్త్ సర్టిఫికెట్ 2 ఫీట్ల పొడవు వచ్చిందో అప్పటి నుంచి టెక్సాస్‌లో బర్త్ సర్టిఫికెట్లో ఇమిడే పేరును మాత్రమే పిల్లలకు పెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.