న్యూయార్క్: లాంచ్ అయిన ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల యూజర్లను సంపాదించి ట్విట్టర్‌కు గట్టిపోటీనిచ్చిన థ్రెడ్స్ యాప్ ఆ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయింది. వారానికే భారీగా యూజర్లను కోల్పోయింది. 50 శాతానికి పైగా యూజర్లను థ్రెడ్స్ కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. లాంచ్ అయిన వారంలోనే రోజూ వారి లాగిన్ల సంఖ్య 49 మిలియన్ల నుంచి 23.6 మిలియన్లకు పడిపోయింది. ప్రస్తుతం థ్రెడ్స్‌కు ట్విట్టర్‌తో పోలిస్తే 22 శాతమే రోజూ వారి వీక్షణలు ఉన్నాయి. యాప్‌లో కొత్త ఫీచర్లను జోడిస్తున్నట్టు మెటా యజమాని జుకర్‌బర్గ్ తెలిపారు.